కండ్రికలో తగ్గిన వరద - బలం ఉన్నవాళ్లకే ఆహారం దొరుకుతోందని ఆవేదన - Floods Decreasing in kandriga - FLOODS DECREASING IN KANDRIGA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 2:20 PM IST
Floods Decreasing in kandriga : విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి ఆరు రోజులు దాటినా ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్ల పరిస్థితి మెరుగుపడిందని అనుకునేలోపు క్రమంగా నీరు పెరుగుతోంది. కండ్రిక, పాయకపురం, రాజరాజేశ్వరిపేట, పైపుల రోడ్డులో నిన్న కొంతమేర వరద పెరిగింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ప్రసుత్తం కండ్రికకు ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అక్కడివారు ఉపిరి పిల్చుకున్నారు.
Vijayawada Floods Updates : మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఆహారం, మంచినీరు, నిత్యావసర వస్తువులను అందిస్తుంది. కానీ కాలనీ చివర ఉన్న వారికి, వృద్ధులకు బలహీనులకు అందడం లేదని కండ్రిక ప్రాంత వాసులు వాపోతున్నారు. కాస్త బలం ఉన్న యువకులే అందినకాడికి తీసుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు ఆహారం పంపిణీ చేసేవారు కాలనీ లోపలకి రావడం లేదని అంటున్నారు. ఎవరైనా సాయం చేయడానికి వచ్చినా బలం ఉన్నవారే ఎగబడి మొత్తం తీసేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని తెలిపారు. ప్రభుత్వమే ఇంటింటికి తిరిగి ఆహారం పంపిణీ చేయాలని కండ్రిక ప్రాంత వాసులు కోరారు.