ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా నిధులను జగన్ దారి మళ్లించారు: దళిత నేత చార్వాకా - CM Jagan Cheated Dalits - CM JAGAN CHEATED DALITS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 4:42 PM IST
YSRCP Government Cheated Dalits : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా నిధులు దారి మళ్లించి దళితులను మోసం చేసిన చరిత్ర వైఎస్సార్సీపీదేనని అంటరానితనం నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చార్వాకా అన్నారు. బాపట్ల జిల్లాలోని స్థానిక ఏఎన్పీఎస్ కార్యాలయంలో సమితి, మాల మహానాడు నాయకుల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దళిత హక్కుల సాధనకు మాల సంఘాల జేఏసీ సభ్యులంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన 27 సంక్షేమ పథకాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి రద్దు చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపించారు. అమ్మ ఒడి పేరుతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని జగనన్న విదేశీ విద్యగా మార్చడం దారుణమని అన్నారు. యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు చేస్తున్న దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.