ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రథోత్సవంలో విద్యుదాఘాతం- 15 మంది చిన్నారులకు గాయాలు - 11Children injured in Current shock - 11CHILDREN INJURED IN CURRENT SHOCK

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 10:51 AM IST

Current Shock while Rathotsavam in Chinna Tekur: కర్నూలు సమీపంలోని చిన్న టేకుర్‌లో విద్యుదాఘాతం కారణంగా  15 మంది చిన్నారులు గాయపడ్డారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా చిన్న టేకుర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. రథానికి విద్యుత్​ తీగలు తగిలి రథం పక్కనే ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను స్థానికులు వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. 

11 Children Were injured in Current Shock: ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వారు వైద్యులను సూచించారు. ప్రస్తుతం చిన్నారులకు ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు తెలిపారు. చిన్నారులు అకస్మాత్తుగా కరెంటు షాక్​కు గురికావడంతో తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు అధికారులు ఒక్కసారి ప్రాంతాన్ని పరిశీలించాలని నంద్యాల టీడీపీ అభ్యర్థి శబరి అన్నారు.   

ABOUT THE AUTHOR

...view details