ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజధానిలో శరవేగంగా జంగిల్​ క్లియరెన్స్​ పనులు - ఐకానిక్ కట్టడాల వద్ద నీటిని తోడేందుకు చర్యలు - Works in jungle clearance - WORKS IN JUNGLE CLEARANCE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 5:23 PM IST

CRDA Special  Works to Clear Water at Iconic Buildings in Amaravati : అమరావతిలో ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని తోడేందుకు సీఆర్​డీఏ (Capital Region Development Authority) ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఒక టీఎంసీ కంటే తక్కువగా ఉన్న నీటిని పాలవాగులోకి తరలించేందుకు కాల్వలు తవ్వే యోచనలో సీఆర్డీఏ ఉంది. ఐఐటీ నిపుణుల నివేదిక వచ్చాక నీటిని ఎత్తిపోయనుంది. రాజధాని పరిధిలో ముమ్మరంగా జరుగుతోన్న జంగిల్ క్లియరెన్స్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లీయర్ చేయాలని మంత్రి ఆదేశించారు. జంగిల్ క్లియరెన్స్ అనంతరం భవన నిర్మాణ పనులు మెుదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

 పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ప్రారంభమైన విషయం విదితమే. రాజధానిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా ఈ జంగిల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details