ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇలాంటి ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు - అప్రమత్తంగా ఉండాలన్న సీఆర్డీఏ అధికారులు - CRDA Action on Illegal layouts

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 3:23 PM IST

CRDA Action on Illegal layouts (ETV Bharat)

CRDA Action on Illegal layouts in Amaravati Region: రాజధాని అమరావతి చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లేఔట్లపై సీఆర్డీఏ (Capital Region Development Authority) దృష్టి సారించింది. రాజధానిలో వెలసిన అక్రమ లేఅవుట్లపై సీఆర్‌డీఏ కొరడా ఝుళిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే ఔట్లపై చర్యలు ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడికొండ పరిసరాల్లో చాలామంది పంట పొలాల్ని స్థిరాస్తి వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి లేఔట్లు వేశారు. సీఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా, నాలా పన్ను చెల్లించకుండా కూడా కొందరు ప్లాట్లు వేస్తున్నారు. 

దీంతో తాడికొండలో రైతుల పొలాల్లో వేసిన అనుమతి లేని ప్లాట్ల వద్ద కంచెలను సీఆర్డీఏ అధికారులు తొలగించారు. లేఅవుట్లలోని రోడ్లను ధ్వంసం చేశారు. ఇలాంటి ప్లాట్లు ఎవరైనా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. వెంచర్ల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని సీఆర్డీఏ అధికారులు సూచించారు. ఇటువంటి అనుమతులు లేని వెంచర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details