జగన్ సీఎం కావటం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం: సీపీఐ రామకృష్ణ - AP Latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 4:28 PM IST
CPI Ramakrishna on BJP and CM Jagan: బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI State Secretary Ramakrishna) ఆరోపించారు. హక్కుల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోదీ (Prime Minister Modi) అణిచి వేస్తున్నారని దుయ్యపట్టారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan) ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. 25 ఎంపీలు గెలిస్తే దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వైఎస్సార్సీపీ (YSRCP), 22 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులుంటే కేంద్రాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Visakha Steel Plant Privatization)పై కూడా జగన్ నోరు మెదపట్లేదని విమర్శించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని రామకృష్ణ మండిపడ్డారు.
"బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీలేదు. హక్కుల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోదీ అణిచివేస్తున్నారు. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కావటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి