ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రత్యేక హోదా, విభజన హామీలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 5:14 PM IST

CPI Ramakrishna Fires On YCP Government: వైసీపీ పాలనలో జగన్ పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని మోసం చేసిన అధ్యాయమని రామకృష్ణ అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై జగన్ అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.  

ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమానికి సీపీఐ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 2019లో ప్రత్యేక హోదా అజెండాగా బీజేపీ మినహా అన్ని పార్టీలు ఎన్నికలకు వెళ్లారు. నేడు విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి మద్దతు తెలుపుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details