ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది అప్పే కానీ గ్రాంట్ కాదు: సీపీఐ నారాయణ - CPI Narayana Press Meet - CPI NARAYANA PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 5:07 PM IST

CPI Narayana press meet in Tirupati: విభజన చట్టంలోని అంశాలను కేంద్రం పరిష్కరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్‍ చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి కేంద్రం అప్పు ఇచ్చిందే కానీ గ్రాంట్ కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి కావాలన్నారు. పోలవరం ముంపు బాధితులకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని డిమాండ్‍ చేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. నెలలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని వైఎస్ససార్ సీపీ నాయకులు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఏంలపై అనేక అనుమానాలున్నాయని 122 దేశాల్లో బ్యాలెట్ పద్దతి ఉందని మన దేశంలో కూడా ఆ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం అవినీతిలో  మాధవరెడ్డి కీలక దోషి అని ఆయన అన్నారు. భూ సమస్యలపై జ్యుడీషియల్ విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు మారారు కానీ కిందస్థాయి అధికారులు మారలేదన్నారు. గత ప్రభుత్వ బాధితులతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని నారాయణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details