ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనూ బాధితుడినే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ - NARAYANA ON LAND TITLING ACT - NARAYANA ON LAND TITLING ACT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 7:56 AM IST
CPI Leader Narayana Comment on Land Titling Act : సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తాను బాధితుడినేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రస్తావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూమిని తనఖా పెట్టడానికి, ఎలాంటి హామీకి ఇది ఊపయోగపడదని పుస్తకం లోపల రాసి ఉంచారని నారాయణ తెలిపారు. రెవెన్యూ అధికారులను అడిగితే ప్రభుత్వం చెప్పింది చేశామని చెప్పారన్నారు.
తెలంగాణలో ధరణి చట్టంతో కేసీఆర్ ఓటమి చెందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో భూ హక్కు చట్టంతో జగన్ మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ హక్కు దారులకు జాయింట్ పట్టా ఇచ్చారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి పత్రాలను ఇవ్వకుండా ఆయన పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ఓడిపోతే పుస్తకం మీద ఉన్న బొమ్మను ఏమి చేయాలని పేర్కొన్నారు.