ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కోడ్​ను ఉల్లంఘించిన రాచమల్లు - ఆధారాలతో సహా 'సీ-విజిల్​'లో ఫిర్యాదు - Code Violation In Proddatur - CODE VIOLATION IN PRODDATUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 5:03 PM IST

Code Violation in Proddatur of YSR Kadapa District : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా కోడ్​ను ఉల్లంఘించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఎన్నికల నిబంధనలను విస్మరించారని జై భీమ్‌పార్టీ నేత సీ-విజిల్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు మరో అయిదుగురు వైఎస్సార్సీపీ నేతలు ఆర్వో గదిలోకి వెళ్లి కుర్చీల్లో కూర్చున్నారని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్‌పర్స్‌న్‌ భీమునిపల్లి లక్ష్మిదేవీ, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్‌ అధ్యక్షురాలు జింకా విజయలక్షి, పురపాలక కౌన్సిలరు గరిశపాటి లక్ష్మీదేవి, వైసీపీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, నాగేంద్రరెడ్డి ఆర్వో గదిలోని కుర్చీల్లో ఉన్న ఫొటోను సీ-విజిల్‌లో జతచేశారు.

అలాగే తన గదిలోకి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు నలుగురు ప్రతిపాదకులు కన్నా అదనంగా మరొకరు ఉండటం గమనించిన ఆర్వో కౌసర్ భాను ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడ ఉన్న సీఐని పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా నలుగురి కంటే ఎక్కువ మందిని ఏ విధంగా లోపలకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details