LIVE : కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి - cm revanth reddy pressmeet - CM REVANTH REDDY PRESSMEET
Published : Jun 21, 2024, 6:59 PM IST
|Updated : Jun 21, 2024, 7:18 PM IST
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన ఇవాళ్టి సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పంట రుణాల మాఫీకి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవడం సహా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రైతుబీమా, పంటల బీమాకు కూడా ఇవే అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. కేబినెట్ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే 2023 డిసెంబర్ 9లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని సీఎం మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Jun 21, 2024, 7:18 PM IST