LIVE : లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ - CM REVANTH REDDY PRESS MEET LIVE - CM REVANTH REDDY PRESS MEET LIVE
Published : Jun 5, 2024, 1:05 PM IST
|Updated : Jun 5, 2024, 1:42 PM IST
CM Revanth Press Meet Over Election Results : రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా ప్రజలు పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. నాడు శాసనసభలోనూ, నేడు పార్లమెంట్ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ, 8 పార్లమెంట్ స్థానాలు, కంటోన్మెంట్‌లో విజయంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అందించిన ఆశీర్వాదాలు తమ ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచాయని పేర్కొన్నారు. ప్రజల మద్ధతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల రిజల్ట్స్ మరోసారి రుజువు చేశాయని తెలిపారు. కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది కార్యకర్తల విజయమని, వారి శ్రమ, కష్టం పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు. నేటితో ఎన్నికల కోడ్ ముగుస్తుందని, మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 5, 2024, 1:42 PM IST