LIVE : ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు - హాజరైన సీఎం రేవంత్రెడ్డి - CM REVANTH REDDY LIVE
Published : Nov 14, 2024, 4:58 PM IST
|Updated : Nov 14, 2024, 6:19 PM IST
Children's Day Live : బాలల దినోత్సవం పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మహనీయుడికి నివాళులు అర్పించారు. నేటి బాలబాలికలే భావిభారత పౌరులని విశ్వసించి.. ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని సీఎం పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయరాదన్న చిత్తశుద్ధితోనే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటిస్తున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి బాల బాలికలతో సరదా గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీఎస్, అధికారులు పాల్గొన్నారు. చిన్నపిల్లలతో ఇలా సమయం గడపడం తనకు ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Last Updated : Nov 14, 2024, 6:19 PM IST