తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజీలో స్నాతకోత్సవంలో సీఎం రేవంత్ - ప్రత్యక్షప్రసారం - CM Revanth Reddy Live

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 12:49 PM IST

Updated : Mar 7, 2024, 12:58 PM IST

CM Revanth Reddy  Live : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో విద్య ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. తమ సర్కార్ పెట్టుబడులు, అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఐటీఐల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పాఠశాలలకు ఏ వసతులు కావాలనే అంశంపై విద్యాశాఖ సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపింది. పాఠశాలల్లో సమస్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే డీఎస్సీ, గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జారీకి కసరత్తులు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజీలో ఏర్పాటు చేసిన వైద్యవిద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తున్నారు.
Last Updated : Mar 7, 2024, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details