ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

CM Revanth Reddy LIVE : తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - CM Revanth Reddy LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 1:11 PM IST

Updated : Mar 16, 2024, 1:54 PM IST

CM Revanth Reddy LIVE : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలన మొదలై 100రోజుల పూర్తైన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులు, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు పలు అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లకు పైగా సాధిస్తుందని ఆయన ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగానే పార్టీ అభ్యర్థుల కసరత్తు చేశారు. ఇప్పటివరకు 4 సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా సీట్లపై కసరత్తు జరుగుతోంది.ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే పెద్ద పీట వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై కూడా ఆరా జరుగుతోంది. మరోవైపు హస్తం గుటికి చేరే నేతల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్​ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ పసునూరి దయాకర్ కలిశారు. రాత్రి బీజేపీ నేత జితేందర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. నేతల చేరికతో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లకు పైగా గెలుచుకొని సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 
Last Updated : Mar 16, 2024, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details