గణేశ్ వేడుకల్లో మనవడి తీన్మార్ స్టెప్పులు - చూసి మురిసిపోయిన సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Grandson Dance - CM REVANTH GRANDSON DANCE
Published : Sep 17, 2024, 10:07 AM IST
CM Revanth Grandson Reyansh Reddy Dance : వినాయక చవితి నవరాత్రోత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి, సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు. వినాయక మండపాల వద్ద ఆటపాటలతో భక్తులు కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. విజ్ఞేశ్వరుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ, ప్రత్యేక పూజలు ఆచరిస్తూ ఆ గణనాథుని స్తుతించారు. అదే సమయంలో భజనలు, కీర్తనలు, డ్యాన్స్‌లు, డీజే పాటలతో హోరెత్తించారు. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనవడు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం బాగా ఆకట్టుకుంటోంది.
జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జనం సమయంలో రేవంత్ మనవడు రేయాన్ష్ రెడ్డి వేసిన చిందులు నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మనుమడు చిందులేసి సందడి చేశాడు. వినాయకుని నిమజ్జనానికి వెళ్తున్న వాహనం ముందు తీన్మార్ స్టెప్పులు వేశాడు. జై బోలో మహరాజ్‌కీ జై అంటూ ఆడిపాడాడు. తమ మనమడి చిందులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు మురిసిపోయారు.