LIVE : రవాణా శాఖలో నూతన ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
Published : Nov 11, 2024, 2:03 PM IST
|Updated : Nov 11, 2024, 2:15 PM IST
CM Revanth Giving appointments to AMVI Officers : రాష్ట్ర రవాణా శాఖలో నూతన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత భారీ స్థాయిలో రవాణాశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఖాళీలను ఇటీవలే భర్తీ చేశారు. రెండేళ్లక్రితం 31 డిసెంబర్ 2022వ తేదీన ఏఎంవీఐల కొలువుల కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం రవాణాశాఖలో ఎంవీఐలు, ఏఎంవీలు కలిపి 340 పోస్టులు ఉన్నాయి. అందులో 142 ఎంవీఐ పోస్టులు, 199 ఏఎంవీఐ పోస్టులు ఉన్నాయి. 199 ఏఎంవీఐ పోస్టులలో 113 పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో రవాణాశాఖలో విధులు నిర్వర్తించాలంటే కష్టంగా మారిపోయిందని, ఇక 113 పోస్టులు భర్తీ అయితే రవాణాశాఖ సేవలు మరింత విస్తృతంగా విస్తరించే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Last Updated : Nov 11, 2024, 2:15 PM IST