LIVE : కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి వివరణ - ప్రత్యక్షప్రసారం - Revanth Krishna water dispute live
Published : Feb 4, 2024, 2:45 PM IST
|Updated : Feb 4, 2024, 3:55 PM IST
CM Revanth Reddy Live : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత విషయంలో అటు ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే దీనిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ వివరణ ఇచ్చింది. విద్యుత్ కేంద్రాలు మినహాయించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించిన మిగిలిన ఔట్‌లెట్ల ద్వారా త్రిసభ్య కమిటి నిర్ణయం మేరకు నీటి విడుదల, నీటి నిర్వాహణ మాత్రమే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బాధ్యత అని రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ధారాదత్తం చేసిందని, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టిందన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ సమావేశం మినట్స్ తప్పుగా వచ్చాయని, సవరణ కోరుతూ తాను లేఖ రాసినట్లు తెలిపింది. మొదట్నుంచీ ఉన్న వాదననే తాము వినిపిస్తున్నామని, ప్రాజెక్టులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని వివరించింది. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇస్తున్నారు. కృష్ణా జలాల ఒప్పంద వివరాలు, 2014 నుంచి జరిగిన ఒప్పంద వివరాలను సీఎం వెల్లడిస్తున్నారు.