తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రెస్ మీట్ - CM Revanth Reddy Press Meet Live - CM REVANTH REDDY PRESS MEET LIVE

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 5:03 PM IST

Updated : May 1, 2024, 5:46 PM IST

CM Revanth Press Meet at Jubilee Hills Residence : రాష్ట్రంలో అత్యధిక లోక్​సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా పదకొండు రోజులే ఉండటంతో ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో విస్త్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లోని తన నివాశంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం పలు విమర్శలు గుప్పించారు. కార్యకర్తలకు ప్రచారంలో ముందుకు సాగేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నారు. నాయకులతో ముమ్మరం ప్రజాక్షేత్రంలో ఉండాలని తెలియజేస్తున్నారు.  
Last Updated : May 1, 2024, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details