తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి - OSMANIA HOSPITAL FOUNDATION LIVE

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 12:58 PM IST

Osmania Hospital Foundation Stone Live : ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. గోషామహల్ మైదానంలో ఏర్పాటు చేయనున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 26.30 ఎకరాల్లో 2 వేల పడకలతో రూ.2,400 కోట్లతో 14 అంతస్తుల్లో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణం జరగనుంది. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాల్లో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఆస్పత్రిలో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు వైద్యుల సంఖ్య కూడా 20శాతం పెరగనుంది. రోజూ దాదాపు 5వేల మందికి ఓపీ సేవలందించేవిధంగా ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

ABOUT THE AUTHOR

...view details