'అన్న వస్తున్నాడంటే ఉక్కపోతే!' - విద్యుత్ తీగలను కట్ చేస్తున్న అధికారులు - CM Jagan Bus Yatra - CM JAGAN BUS YATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:12 PM IST
CM Jagan Bus Yatra Kanigiri Prakasam District : సీఎం జగన్ సభలన్నా, బస్సు యాత్రలన్నా, రోడ్డు షోలన్నా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారంటే చాలు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్నా పచ్చని చెట్లు, విద్యుత్ తీగలు కనిపించకుండా అధికారులు తొలగించేస్తున్నారు. ఇవాళ సీఎం జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి పర్యటన కోసం స్థానిక అధికారులు విద్యుత్ తీగలను తొలగించారు.
Officials Stopped Electricity Due to Jagan Bus Trip : సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అధికారులు సీఎం బహిరంగ సభ నిర్వహించే పామూరు బస్టాండ్ కూడలిలో విద్యుత్ వైర్లు, సర్వీస్ తీగలను తొలగించారు. దీంతో సీఎం పర్యటించే రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉక్కపోతతో నానా అవస్థలు పడుతున్నారు. సీఎం జగన్ పర్యటిస్తే మాకు ఎందుకు ఈ తిప్పలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.