ప్రజాస్వామ్య పరిరక్షణలో లీగల్ సెల్ కృషి ప్రశంసనీయం: చంద్రబాబు - Chandrababu Meeting With Legal Cell - CHANDRABABU MEETING WITH LEGAL CELL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 11:35 AM IST
CM Chandrababu Naidu Meeting With TDP Legal Cell : వైఎస్సార్సీపీ సర్కారు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ చేసిన పోరాటాలు, కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వమే దారుణాలకు పాల్పడడం వైఎస్సార్సీపీ హయాంలోనే చూశామన్నారు. ఉండవల్లి నివాసంలో పార్టీ లీగల్ సెల్ సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎదుర్కొన్న వారిపై ఎన్ని కేసులు పెట్టినా వాటిపై లీగల్ సెల్ బాగా పనిచేసిందన్నారు. అన్ని వేళలా లీగల్ సెల్ తరఫున కార్యకర్తలకు అండగా ఉన్నారని ప్రశంసించారు.
TDP Legal Cell Congratulate CM Chandrababu : ప్రభుత్వమే దారుణాలకు పాల్పడడం, రౌడీయిజం చేయడం అనేది వైఎస్సార్సీపీ హయాంలోనే చూశామని చంద్రబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని, పార్టీని నమ్ముకున్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లీగల్ సెల్ సభ్యులు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.