ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నీటి వివాదం - కర్రలు, రాళ్లతో వైఎస్సార్సీపీ-టీడీపీ శ్రేణుల ఫైట్​ - Six TDP Leaders injured in Clash - SIX TDP LEADERS INJURED IN CLASH

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 3:37 PM IST

Clash Between YSRCP - TDP Activist for Water in Anantapur District : అనంతపురం జిల్లా డి. హీరేహాల్ మండలం సిద్ధాపురం తాండలో తాగునీటి విషయమై వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయులు గురువారం రాత్రి బాహాబాహీకి దిగారు. శుద్ధజల ప్లాంటు వద్ద తాగునీరు పట్టుకునే సమయంలో మహిళలు గొడవ పడటంతో వైఎస్సార్సీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు. తండాలోని టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం వర్గీయులు పరస్పరం కర్రలు, రాళ్లు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఆరుగురు తెలుగుదేశం నాయకులకు గాయాలయ్యాయి. వారిని బళ్లారి విమ్స్‌కు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై డి.హీరేహాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ నేతల అల్లర్లు తగ్గడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న గొడవలు కూడా చిలికి చిలికి గొడ్డల్లు, కర్రలతో  కొట్టుకునే వరకు వెళ్లడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details