టీడీపీ ఎన్నికల ప్రచారంలో జగన్ పాటలు- ప్రశ్నించినందుకు దాడిచేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు - YSRCP TDP leaders Clashes - YSRCP TDP LEADERS CLASHES
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:10 PM IST
Clash Between YSRCP and TDP Leaders in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూరం మండలం ముదిరెడ్డిపల్లిలో గురువారం రాత్రి వైఎస్సార్సీపీ, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ను గెలిపించాలని కోరుతూ నందమూరి వసుంధరా దేవి ముదిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కొనసాగుతుండగా కొందరు వైఎస్సార్సీపీ నాయకులు జగన్ పాటలు పెట్టడంతో వివాదం చెలరేగింది.
రోడ్ షో అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మూకుమ్మడిగా తెలుగుదేశానికి చెందిన నారాయణ రెడ్డి ఇంటిపై దాడి చేసినట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇరువర్గాల ఘర్షణలో టీడీపీ కార్యకర్తలైన ప్రకాశ్ రెడ్డికి తలకు తీవ్ర గాయం అయ్యింది. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.