ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు టీడీపీకి ఓటు వేయాలి: సీకే బాబు - CK Babu Support for TDP candidate

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 4:14 PM IST

CK Babu Declared His Support For TDP Candidate Jaganmohan: తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వైసీపీ పాలనను తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్​కు సీకే బాబు తన మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలు దిగజారి పోయాయని సీకే బాబు పేర్కొన్నారు. ఉత్తమ పాలన రావాలంటే తెలుగుదేశంకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం గురజాల జగన్మోహన్​ను సీకే బాబు ఆశీర్వదించారు. చిత్తూరు బలిజ సంఘం ఆధ్వర్యంలో సమావేశమైన బలిజ కులస్థులు టీడీపీ అభ్యర్ధి గురజాల జగన్మోహన్ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేస్తామని గురజాల జగన్మోహన్‌ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలోకి చేరుతున్నారు. దీని బట్టి 2024 ఎన్నికలు ఎంత ఉత్కంఠబరితంగా ఉండబోతున్నాయో తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details