పట్టణ పౌర సంక్షేమ సంఘం ధర్నా- బాబోయ్ కుక్కల నుంచి రక్షించండి - people suffering with dog bites - PEOPLE SUFFERING WITH DOG BITES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 2:10 PM IST
Civil Welfare Society Protest at Kurnool Collectorate About Dogs Isuue : కుక్కల భారీ నుంచి కర్నూలు నగర ప్రజలను కాపాడాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కర్నూలులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు వెంటనే స్పందించి వాటిని నియంత్రించాలని కోరారు. గతంలో కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారని ప్రస్తుతం అవి చేయడం లేదని వారు తెలిపారు. వెంటనే కుక్కలను వీధుల నుంచి తరలించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎవరైనా ఒక్కరు బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారని ఆవేదన చెందారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్లు అందరు కుక్కకాటుకు బాధితులుగా మారుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వీధి కుక్కలను నియంత్రించి నగర ప్రజలను కాపాడాలన్నారు. ఇప్పటికే కుక్కకాటుతో చాలా మంది బాధపడుతున్నారని తెలియజేశారు.