ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పనిచేస్తున్న స్టేషనే వారికి ముప్పుగా మారనుందా? - CHITWELL POLICE STATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 2:03 PM IST

Chitwell Police Station Dilapidated Stage in Annamaya District : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌ శిథిలావస్థకు చేరింది. సరైన కార్యాలయం లేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌ పైకప్పు పగుళ్లు బారి కూలడానికి సిద్ధంగా ఉంది. దీంతో పోలీసు అధికారులు కార్యాలయానికి వెళ్లేందుకు భయపడుతున్నారు. వందేళ్ల కిందట బ్రిటీష్‌ వాళ్లు నిర్మించిన భవనం కావడంతో ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌ పగుళ్లు బారింది. 

వర్షం వస్తే గదుల్లోకి నీళ్లు వస్తున్నాయని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కొన్ని గదుల్లో అయితే పైకప్పు పూర్తిగా దెబ్బతిని కూలిపోయే పరిస్థితిల్లో ఉందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్​ స్టేషన్​ రావాలంటేనే చాలా భయంగా ఉందని తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టేషన్​కు మరమ్మతులు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details