ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇటుక బట్టీల మాటున భారీ ఎత్తున మద్యం గుట్టలు- చెవిరెడ్డి అనుచరుడి హవా - Huge Liquor at YSRCP follower - HUGE LIQUOR AT YSRCP FOLLOWER

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 12:21 PM IST

Chevireddy Follower Caught With Huge Liquor  in Tirupati : తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్ద ఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంటపల్లి నుంచి యల్లంపల్లి వెళ్లే మార్గంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి ముఖ్య అనుచరుడికి చెందినదిగా భావిస్తున్న ఇటుకల బట్టీ వద్ద పోలీసులు భారీ ఎత్తున మద్యాన్ని గుర్తించి శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ మినీ లారీలో మద్యం ఉండగా విశ్వసనీయ సమాచారంతో అధికారులు ఘట నాస్థలానికి చేరుకున్నారు. 

లారీలో 200-300 వరకు మద్యం కేసులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటుక బట్టీల పక్కనే ఉన్న షెడ్​ లోనూ పెద్ద ఎత్తున మద్యాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు ఇటుక బట్టీల వద్ద పని చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అధికార పార్టీ నాయకులపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details