ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రామచంద్రాపురంలో చంద్రబాబు ప్రజాగళం - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU PRAJAGALAM LIVE - CHANDRABABU PRAJAGALAM LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 9:16 PM IST

Updated : Apr 3, 2024, 10:01 PM IST

Chandra Babu Prajagalam Live in Ramachandrapuram : ప్రజాగళం రెండో విడతలో భాగంగా చంద్రబాబు మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. ఈరోజు నుంచి 5 రోజులపాటు ప్రజాగళం షెడ్యూల్‌ ఖరారైంది. ఈరోజు సాయంత్రం కొత్తపేటలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాల్గొని మాట్లాడుతున్నారు. 4వ తేదీన కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెదకూరపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం జరిపేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌షోలలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చంద్రబాబు ప్రజాగళం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 3, 2024, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details