LIVE అనంతపురం బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Praja Galam live - CHANDRABABU PRAJA GALAM LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 3:53 PM IST
|Updated : Mar 28, 2024, 4:37 PM IST
Chandrababu Praja Galam live: బుక్కరాయసముద్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ప్రజాగళం భహిరంగ సభలో పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్నారని, తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రత్యేకహోదా, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ క్యాలెండర్, కరెంటు ఛార్జీల తగ్గింపు, మెగా డీఎస్సీ, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించే బాధ్యత తమదని చెప్పారు. సీమను తాము హార్టికల్చర్ హబ్‌గా చేస్తే, జగన్ రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమికి మద్దతివ్వాలని కోరారు. వైసీపీ అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో 49 చోట్ల వైకాపాను గెలిపిస్తే ఏం ఒరగబెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు.
Last Updated : Mar 28, 2024, 4:37 PM IST