ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు - అమరావతిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో హడావుడి - ChandraBabu Swearing Arrangements

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 9:15 PM IST

చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు - అమరావతిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో హడావుడి (ETV Bharat)

Chandrababu Naidu Swearing Ceremony Arrangements In AP : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం సరంజామా సిద్ధమైంది. అయితే ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలనేదానిపై నిర్ణయం వెలువడకపోవటంతో సభ ఏర్పాట్లను ఇంకా ప్రారంభించలేదు. రాజధాని ప్రాంతంలోనే ప్రమాణస్వీకారం ఉంటుందనే ఊహాగాణాలతో బహిరంగ సభ సామగ్రితో వాహనాలతో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో హడావుడి మొదలైంది. 2014లో నాగార్జున విశ్విద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు రాజధాని ప్రాంతమైన రాయపూడి, మందడం ప్రాంతంలో ప్రమాణస్వీకారం చేస్తారా! లేదా మంగళగిరిలోని ఎయిమ్స్‌ సమీపంలో ఉన్న 300 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రమాణస్వీకరణ కార్యక్రమం ఉంటుందా? అన్నదానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు రాగానే ఏర్పాట్లు ప్రారంభించేందుకు సరంజామాను సిద్ధం చేశారు.

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details