LIVE: మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Election Campaign - CHANDRABABU ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 4:29 PM IST
|Updated : Mar 31, 2024, 5:21 PM IST
Chandrababu Election Campaign Live: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీల అధినేతలు రంగంలోకి దిగి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలిస్తున్నారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రచారం చేపట్టారు. ప్రచారంలో జగన్ సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని ఎన్నో హామీలిచ్చి జనాన్ని మోసం అధికారంలోకి వచ్చాడని దుయ్యబడుతున్నారు. జగన్ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పునర్వైభవం తీసుకువస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కాపురం సభలో పాల్గొన్నారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి వరకు చంద్రబాబు షెడ్యూలు ఖరారు అయ్యింది. మలివిడత ప్రచారం షెడ్యూల్‌కి సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా మార్కాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Mar 31, 2024, 5:21 PM IST