తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : కరీంనగర్​లో కేంద్ర మంత్రి బండి సంజయ్​కు మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సన్మానం - Central Minister Bandi Sanjay LIVE - CENTRAL MINISTER BANDI SANJAY LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 4:04 PM IST

Updated : Jul 14, 2024, 4:11 PM IST

Central Minister Bandi Sanjay Meeting Live at karimnagar : కరీంనగర్​కు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్​ హామీ ఇచ్చారు. కరీంనగర్​ కార్పొరేటర్లు బండి సంజయ్​ను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జన్మభూమి కరీంనగర్​ గడ్డ రుణం తీర్చుకుంటానన్నారు. కరీంనగర్​ను అద్దంలా తీర్చిదిద్దుతానని తెలిపారు. జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యే గంగుల కమలాకర్​తో చర్చిస్తానని వివరించారు. స్మార్ట్​ సిటీ పనులను మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలో కరీంనగర్, జగిత్యాల రహదరి విస్తరణ పనుల అంశం ఉండటంతో సెప్టెంబర్​లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు.
Last Updated : Jul 14, 2024, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details