ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అలుపెరుగని అక్షరయోధుడికి అన్నదాతల సంతాపం - Capital Farmers Condolence To Ramoji Rao - CAPITAL FARMERS CONDOLENCE TO RAMOJI RAO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 4:51 PM IST

Capital Farmers Condolence To Ramoji Rao : రామోజీరావు మరణంపై అమరావతి రాజధాని రైతులు సంతాపం తెలిపారు. వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, తాడికొండ గ్రామాల్లో రామోజీరావు చిత్రపటాలకు అంజలి ఘటించారు. ఈనాడు-ఈటీవీ వల్లే తమ ఉద్యమం ప్రపంచ స్థాయికి చేరిందని రైతులు గుర్తు చేసుకున్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి చాటిన అక్షర యోధుడు రామోజీ అని అన్నదాతలు కీర్తించారు. సమాజాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. 

రామోజీరావు లాంటి మహోన్నత వ్యక్తిని ఇకపై తమ జీవితంలో ఎన్నడూ చూడలేమని ఆవేదన చెందారు. వ్యవసాయంలో ఎన్నే మెళకువలు తెలియజేశారని గుర్తు చేస్తుకున్నారు.  రాజధాని రైతులు రామోజీరావు అకాల మరణానికి కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థికంగా సామాజికంగా రాజధానికి దిక్సూచి లాంటి వారు రామోజిరావు అని అన్నదాతసలు కొనియాడారు. వ్యవసాయ రంగానికి రామోజీ రావు సేవలు అనితర సాధ్యమైనవని కీర్తించారు. ఇకపై మా మార్గదర్శి లేరనే మాట మాకెతో బాధాకరంగా ఉందని రైతులు ఆవేదన చెందారు.

 

ABOUT THE AUTHOR

...view details