తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సుల్తాన్‌పూర్‌లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ ప్రత్యక్షప్రసారం - BRS Praja Aashirwada Sabha live - BRS PRAJA AASHIRWADA SABHA LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 6:46 PM IST

Updated : Apr 16, 2024, 7:37 PM IST

BRS Praja Aashirwada Sabha live : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే, బలమైన ప్రతిపక్షం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా హామీల అమలు చేసేలా పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బలమైన ప్రతిపక్షం కావాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు.కరీంనగర్ కదనభేరితో ఇప్పటికే పార్లమెంట్​ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టిన కేసీఆర్, ఇవాళ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వేదికగా జరగనున్న బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మెదక్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గులాబీ పార్టీ​ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
Last Updated : Apr 16, 2024, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details