LIVE : తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Harish Rao Press Meet Live - HARISH RAO PRESS MEET LIVE
Published : Jul 23, 2024, 5:46 PM IST
|Updated : Jul 23, 2024, 5:59 PM IST
BRS MLA Harish Rao Press Meet Live : కాంగ్రెస్ పార్టీ హామీల అమలు, ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఆ దిశగానే ఇవాళ గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షత ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, లేవనెత్తిన విషయాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి. గతంలో జరిగిన సమావేశానికి అనారోగ్యం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు. సమావేశం వివరాలను మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు మీడియాకు వివరిస్తున్నారు. హరీశ్ రావు ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Jul 23, 2024, 5:59 PM IST