తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్​లో హరీశ్​ రావు మీడియా సమావేశం - EX Minister Harish Rao Live - EX MINISTER HARISH RAO LIVE

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 3:59 PM IST

Updated : May 21, 2024, 4:38 PM IST

BRS Leader Harish Rao  Live from Telangana Bhavan : మాజీ మంత్రి హరీశ్​ రావు హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో మీడియా సమవేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాతలు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మాట మారుస్తోందని మాజీ మంత్రి హరీశ్​ రావు విమర్శిస్తున్నారు. కేవలం సన్నరకం ధాన్యానికే రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి, దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు ఈ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని చెబుతున్నారు. బీఆర్ఎ​స్ ప్రభుత్వంలో​ చేసిన రిక్రూట్​మెంట్​ను  ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని తెలుపుతున్నారు. అట్టహాసంగా నియామక పత్రాలిచ్చి జీతభత్యాలను పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. జీతాలందక నర్సింగ్ ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలిస్తామని అనేక గొప్పలు చెప్పారని గుర్తు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేస్తున్నారు. 
Last Updated : May 21, 2024, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details