LIVE క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్ మీడియా సమావేశం - బద్వేల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం - BROTHER ANIL - BROTHER ANIL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 3:18 PM IST
|Updated : Apr 29, 2024, 3:47 PM IST
Brother Anilkumar press conference at Badwel : క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరుతెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ ఇవ్వాళ మధ్యాహ్నం 3:00 గంటలకు బద్వేల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో క్రైస్తవ నాయకులు, క్రైస్తవేతరులు పాల్గొంటారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్.. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైఎస్సార్సీపీ మద్దతుగా క్రిస్లియన్లను కూడగట్టే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఇప్పుడు ఆయనే వైఎస్సార్సీపీ, జగన్‌కు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వైయస్‌ఆర్ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్ బహిరంగంగా విమర్శలు చేశారు. సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్ అనిల్‌కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ.. పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడం వినిపించింది. కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు.
Last Updated : Apr 29, 2024, 3:47 PM IST