LIVE : గజ్వేల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర - ప్రత్యక్ష ప్రసారం - గజ్వేల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర
Published : Feb 25, 2024, 7:03 PM IST
|Updated : Feb 25, 2024, 7:49 PM IST
BJP Vijaya Sankalp Yatra Gajwel : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. గజ్వేల్లో జరుగుతున్న యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్రలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అంతకు ముందు భద్రాచలంలో జరిగిన యాత్రలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా భద్రాద్రి రామాలయం బీజేపీ సమావేశ ప్రాంగణం వద్ద పోలీసులు, భద్రతా బలగాలు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఈ యాత్రలో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో సుమారు 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించే విధంగా యాత్రను ప్లాన్ చేశారు. గతంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
Last Updated : Feb 25, 2024, 7:49 PM IST