అబద్ధాలతోనే వైసీపీ పాలన - జగన్ అర్జునుడు కాదు సైతాన్: సత్యకుమార్ - YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 12:52 PM IST
BJP Satya Kumar Fires on CM YS Jagan: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అపద్దాలతోనే పాలన సాగిస్తుండడమే.. కాకుండా రాష్ట్ర గవర్నర్ తోను అబద్దాలు చెప్పించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అబద్దాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుంటుపడిందని, పారిశ్రామిక రంగం ఊసే లేదన్నారు. అనంతపురంలో లాజిస్టిక్ పార్కు వస్తే దానికి సంబంధించి ఇప్పటిదాకా స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు.
రాయలసీమ వ్యాప్తంగా సాగు, తాగునీరు లేక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన ఉపాధి హామీ నిధుల అవకతవకలపై తాను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి సంబంధించి బిల్లులు ఇవ్వకుండా చూస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మరోసారి మోసం చేయడానికి దరిద్రమైన అబద్ధాలతో రాష్ట్రానికి సైతాన్గా మారారని విమర్శించారు. అబద్ధాలు చెబుతూ అభిమన్యుడు, అర్జునుడని చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ అర్జునుడు కాదు సైతాన్ అని విమర్శించారు. త్వరలో ఈ సైతాన్ నుంచి ప్రజలకు విముక్తి కలిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.