తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : కరీంనగర్​లో బండి సంజయ్​ మీడియా సమావేశం - Bandi Sanjay press meet - BANDI SANJAY PRESS MEET

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 11:27 AM IST

Bandi Sanjay Live : కరీంనగర్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్​ ప్రజలను మోసగించిందని  ​ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని చెప్పారు. తమ మేనిఫెస్టో ఖురాన్​, బైబిల్​, భగవద్గీత అని కాంగ్రెస్​ నేతలు చెప్పారని మండిపడ్డారు.ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం, పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయని కాంగ్రెస్​ నేతలు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మరోవైపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటమి ఖాయమైందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details