లోకేశ్ క్షమాపణలు- మంచి సంప్రదాయాలకు తెరతీశారంటూ బీజేపీ నేత ప్రశంసంలు - BJP Leader Congratulate To Lokesh - BJP LEADER CONGRATULATE TO LOKESH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 8:06 PM IST
Minister Nara Lokesh Replied Thanking To BJP Leader Narasimha Rao : తన శాఖలో జరిగిన తప్పు కాకపోయినా పోలీసుల మితిమీరిన చర్యలకు మంత్రి లోకేశ్ క్షమాపణ చెప్పటాన్ని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అభినందించారు. నిన్న కమ్యూనిస్ట్ నేతలను అరెస్టు చేయటంపై లోకేశ్ క్షమాపణలు చెప్పినందుకు అభినందించారు. పోలీసుల మితిమీరిన చర్యలకు క్షమాపణ చెప్పి విద్యా శాఖలో అనేక ప్రభుత్వ పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టి రాజకీయాల్లో మంచి సంప్రదాయాలకు తెరతీశారంటూ ప్రశంసించారు. జీవీఎల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు ఖచ్చితంగా జరుగుతాయని ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూడటమే నాయకుడి బాధ్యత అని తాను బలంగా నమ్ముతానని వెల్లడించారు. కూటమి నేతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసి ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని లోకేశ్ తెలిపారు.