పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు : కిరణ్ కుమార్ రెడ్డి - BJP Leader Kiran Kumar Reddy - BJP LEADER KIRAN KUMAR REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 9:03 AM IST
BJP Leader Kiran Kumar Reddy Comments on Peddireddy Ramachandra Reddy : డీసీసీ అధ్యక్ష పదవి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరులో ఆయన సోదరుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ర్యాలీ, బహిరంగ సభల్లో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి అయ్యే అర్హత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఉందా అంటూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఎవరి కాళ్లు పట్టుకోలేదని, డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన కాళ్లను రెండు సార్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.