బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - ప్రకటించడమే తరువాయి - Nallamilli Ramakrishna Reddy - NALLAMILLI RAMAKRISHNA REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 8:00 PM IST
TDP leader Nallamilli Ramakrishna Reddy: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ దాదాపు ఖరారైంది. రేపటిలోగా అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు రామవరంలోని నివాసంలో, నల్లమిల్లిని బీజేపీ నేత కంటిపూడి సర్వరాయుడు కలిశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనపర్తి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేయడం ఖాయమని ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తామని కంటిపూటి స్పష్టం చేశారు. త్వరలోనే అధిష్టానం నుంచి మంచి ప్రకటన వస్తుందని సర్వరాయుడు అన్నారు. మూలారెడ్డి కుటుంబంతో తమకు ఎప్పటినుంచో అనుబంధం ఉందన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తనకు మద్దతు ప్రకటించిన సర్వరాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గత 20 రోజులుగా అనపర్తి లో జరుగుతున్న పరిస్థితిపై చంద్రబాబుతో మాట్లాడానన్నారు. చంద్రబాబు నిర్ణయమే తమ శిరోధార్యం అని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ కేటాయించిన నేపథ్యంలో నల్లమిల్లి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారని తెలుస్తోంది.