ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీటీడీ గత పాలకమండలి నిర్ణయాలపై విచారణ జరపాలి- భానుప్రకాష్ రెడ్డి - TTD Governing Body at YCP Govt - TTD GOVERNING BODY AT YCP GOVT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 4:13 PM IST

BJP Leader Bhanuprakash Reddy Criticized Decisions of TTD Governing Body : తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పాలకమండలి నిర్ణయాలపై పలు అనుమానాలున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అవసరం లేకున్న కోట్లాది రూపాయులు ఖర్చుపెట్టి పనులు చేపట్టారని విమర్శించారు. కమీషన్ల కోసం టేబుల్ ఎజెండాగా కొన్ని అంశాలను చేర్చి అవసరం లేకున్నా పనులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత పాలక మండలి నిర్ణయాలపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారని గుర్తుచేశారు. 

అయితే అధికారులపైన కాకుండా నిర్ణయాలకు సంబంధం ఉన్న ధర్మకర్త మండలి అధ్యక్షుడు, సభ్యుల మీద కూడా చేయాలని డిమాండ్ చేశారు. అసలు సూత్రదారులు, పాత్రదారులు వారేనని విమర్శించారు. వందల కోట్ల రుపాయలు కమీషన్లు, వాటాలు తీసుకుంది వారేనని ఫిర్యాదులు ఉన్నాయని వెల్లిడించారు. కొంతమంది బోర్డు మెంబర్లకు కూడా తెలియకుండా ఇంజినీరింగ్ పనులను ఆమోదించారన్నారు. గతంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపైన అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పాలకమండలి నిర్ణయాలపై సమగ్రంగా విజిలెన్స్ విచారణ చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details