వైఎస్సార్సీపీ నేతలకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదు- బీజేపీ భానుప్రకాష్ - BJP Bhanu Prakash on YSRCP Attacks
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 4:46 PM IST
BJP Leader Bhanu Prakash Reddy on YSRCP Attacks: వైఎస్సార్సీపీ నాయకులకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలనే కసితో ఓట్లు వేశారన్న ఆయన జగన్ అరాచక పాలన అంతం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. జూన్ నాలుగో తేదీన రాష్ట్రంలో అధికార మార్పిడీ జరిగుతుందని, వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, దాడుల నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"వైఎస్సార్సీపీ నాయకులకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదు. అందుకే ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలనే కసితో ఓట్లు వేశారు. జగన్ అరాచక పాలన అంతం కావడం ఖాయం." - భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి