కేసీఆర్ అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు : కిషన్‌రెడ్డి
Published : Feb 27, 2024, 3:10 PM IST
BJP Kishan Reddy Fires on BRS And Congress : బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా హైదరాబాద్, కార్వాన్‌లోని దాదావాడి జైన్ మందిర్ నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈసారి కూడా విజయం సాధించి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిందని దాని వల్ల తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీకి సేవ చేయటమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఆర్థిక రంగంలో, శాంతిభద్రతలో, మౌలిక వసతుల కల్పనలో, పెట్టుబడి రంగంలో బీజేపీ మాత్రమే పని చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారత దేశ గౌరవం పెరుగుతోందని తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా వారిని ఆశీర్వదించాలని కోరారు.