కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పిన బైక్- ఎనిమిదేళ్ల చిన్నారి మృతి - Bike Turnover 8 Year Girl Died - BIKE TURNOVER 8 YEAR GIRL DIED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 5:14 PM IST
Bike Turnover 8 Year Girl Died In Anantapur District : ఎనిమిదేళ్ల చిన్నారిని రక్తపుమడుగులో చూసి తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది. పరీక్ష కోసమని తీసుకెళ్లిన పాప ఇక ప్రాణాలతో లేదని కన్న తల్లికి చెప్పడమెలా అని రోదిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ల కళ్లు చెమ్మగిల్లాయి.
అనంతపురం జిల్లా నార్పలలో అభిరుచి రెస్టారెంట్ ఎదుట నడిమి దొడ్డి గ్రామానికి చెందిన తండ్రీకూతురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉన్నట్టుండి కుక్క అడ్డు రావడంతో ఆ కుక్కని తప్పించబోయిన ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న విద్యార్థిని ఝాన్సీ (8) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన ఝాన్సీ తండ్రిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఝాన్సీని ఆ బాలిక తండ్రి రాప్తాడు లో రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశానికి పోటీ పరీక్ష రాయడానికి తీసుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.