వైభవంగా శ్రీశైలం భ్రమరాంబ దేవి అమ్మవారి కుంభోత్సవ పూజలు - Bhramaramba Devi Kumbotsavam - BHRAMARAMBA DEVI KUMBOTSAVAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 3:26 PM IST
Bhramaramba Devi Kumbotsavam in Srisailam : శ్రీశైలం మహా క్షేత్రంలో భ్రమరాంబ దేవికి వైభవంగా కుంభోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున భ్రమరాంబ దేవికి ఏకాంతంగా నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చనను అర్చకులు నిర్వహించారు. దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు హరిహర రాయ గోపురం వద్ద ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారికి మంగళహారతులతో పూజలు చేశారు. సాయంత్రం కుంభోత్సవ కీలక ఘట్టం జరగనుంది, సాయంత్రం సింహ మండపం వద్ద అన్నాన్ని పెద్ద రాశిగా పోస్తారు.
అన్నరాశిపై కర్పూర హారతులను వెలిగిస్తారు. ప్రదోషకాలంలో మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. అన్నాభిషేకం తర్వాత స్వామి వారి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అదే సమయంలో ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో భ్రమరాంబా దేవికి కుంభ హారతిని సమర్పిస్తారు. కుంభహారతి సమర్పించిన తర్వాత అమ్మవారికి కొబ్బరి, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పిస్తారు. ఉత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున పసుపు, కుంకుమలతో బ్రమరాంబా దేవికి అర్చన చేసి శాంతి ప్రక్రియ జరిపిస్తారు.