మధిరలో సీనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు - DISTRICT COURT IN MADHIRA
Published : Oct 26, 2024, 4:59 PM IST
Madhira District Courts : ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. అనంతరం సబ్ కోర్ట్, సివిల్ జడ్జి కోర్టుల నూతన భవన సముదాయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీ సుధ, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ భీమపాక నగేష్ పాల్గొన్నారు. జిల్లా కోర్టు న్యాయవాదులు పూర్ణకుంభంతో వేదమంత్రాల నడుమ హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మధిర ప్రాంతంలో న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువగా రానున్నాయని పేర్కొన్నారు.
అనంతరం దగ్గరలోని సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గదులను వారు ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ చిన్న తిరుపతిగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. కాగా మధిర శాసన సభ నియెజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు.